సర్వలోక కళ్యాణం కోసం వినుకొండలో అతిపెద్ద మహా యాగం
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ డాల్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు నిర్వాహకులతో అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్య శ్రీ హిమాలయ గురూజీ గురువారం సమావేశం అయ్యారు. సర్వలోక కళ్యాణం కోసం త్వరలో వినుకొండలో జరగనున్న అతిపెద్ద మహా యాగం కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించినట్లు శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాగం జయప్రదం లో భాగంగా సహాయ సహకారాలను త్వరగా అందించాలని అందుకు డాల్ అండ్ ఆయిల్స్ మిల్లర్స్ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా వారికి పూజ్యశ్రీ హిమాలయ గురూజీకి మంగళ శాసనాలు తెలిపినట్లు వివరించారు. ఈ మహా యాగం జయప్రదం లో భాగంగా త్వరలోనే ఆయా సామాజిక వ్యాపార ఉద్యోగ ఇలా అన్ని రంగాల వారితో దశలవారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు అధ్యక్షులు పెండ్యాల మోహన్ రావు కొప్పురావూరి సుధాకర్ ట్రెజరర్ కనిగండ్ల కోటేశ్వరరావు పెండ్యాల కాశి తాతా రమేష్ పెండ్యాల పుల్లారావు సురేష్ పరుచూరి సత్యనారాయణ మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : సర్వలోక కళ్యాణం కోసం వినుకొండలో అతిపెద్ద మహా యాగం)