నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
హర్షం వ్యక్తం చేసిన పెబ్బేరు ప్రెస్ క్లబ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వానికి ప్రజలకు వారది గా పని చేస్తున్న పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు నూతనంగా స్థలం కేటాయించడంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కోసం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి గత కొన్ని రోజుల క్రితం పెబ్బేరు ప్రెస్ క్లబ్ తరఫున వినతిపత్రం అందజేయగా ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించి ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ప్రొసీడింగ్ కాపీని గురువారం విడుదల చేశారు. పెబ్బేర్ ప్రెస్ క్లబ్ పై సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ తరఫున అధ్యక్షులు గొడుగు బాలవర్ధన్,మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. (Story :నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే)