తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు
న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో గురువారం నాడు వినుకొండ తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని తహసిల్దార్ ఎం. సురేష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వేసవి రోజులు వచ్చిన కారణంగా కార్యాలయానికి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడకుండా దాహార్తి తీర్చేందుకు ఈ మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సురేష్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో డిటి. మురళి, ఆర్ ఐ. శ్రీహరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు)