శిశు మరణాల పై సమగ్ర సమీక్ష
ప్రత్యేక వైద్య బృందం గ్రామాల సందర్శన
న్యూస్ తెలుగు /చింతూరు : డిప్యూటీ డి యం అండ్ హెచ్ ఓ డాక్టర్ పుల్లయ్య మార్గదర్శకత్వంలో తులసిపాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కల్లేరు, చదలవాడ గ్రామాల్లో బృందం సందర్శించి, తల్లి దండ్రులను, ఫీల్డ్ సిబ్బందిని వివరంగా విచారించారు. శిశు మరణాల కారణాలను విశ్లేశించి, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పరిశీలన లో తగిన వైద్యం, పోషణ, మాత శిశు సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు బలోపేతం చేయాలనీ, అలాగే సమర్ధవంతమైన ప్రణాళిక తో భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం లో చింతూరు ఐ టి డి ఎ పి ఓ అపూర్వ భరత్, ప్రత్యేక వైద్య నిపుణులు కాకినాడ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లు జ్ఞాన సురేష్ కుమార్ ,సి హెచ్. గోపిచంద్, జి. సర్వేశ్వర్రావు,ఏ. శ్రావణి,యం. రాజేష్,కె. శ్రీకాంత్ రెడ్డి, తులసిపాక డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి,డాక్టర్ నిఖిల్, సూపర్ వైజర్ లు, ఎ యన్ యం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : శిశు మరణాల పై సమగ్ర సమీక్ష)