ఎరువుల షాపులు తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలో ఇంటర్నల్ స్క్వాడ్ తనిఖీ లో భాగంగా నర్సరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మస్తానమ్మ (ఏ.డి.ఏ) మరియు వినుకొండ మండల వ్యవసాయ అధికారి (ఏ.ఓ) జి. వరలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎరువుల షాపు లలో బయోస్టిమ్యులెంట్ల (జీవప్రేరకాలు) ల గూర్చి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణదారులు విక్రయిస్తున్న బయోస్టిమ్యులెంట్ల నాణ్యత, లైసెన్స్ మరియు లేబుళ్ల వివరాలను పరిశీలించారు.G1,G2,G3 ఉన్న బయోష్టిములంట్స్ మాత్రమే రైతులకు విక్రాయించాలని, అనధికార బయోస్టిమ్యూలంట్స్ రైతులకు విక్రాయించినట్ల లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన బయోస్టిమ్యులెంట్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా జీవప్రేరకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు బయోస్టిమ్యులెంట్లు కొనుగోలు చేసే ముందు, ఉత్పత్తిపై ఉన్న లేబుల్ వివరాలు, తయారీ సంస్థ పేరు, అనుమతుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. నకిలీ లేదా నాసిరకం ఉత్పత్తులు ఎదురైతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. (Story : ఎరువుల షాపులు తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు)