వివాహానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం కేంద్రంలో వల్లపు రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉదయ్ కుమార్ వెన్నెల బుధవారం మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, మాజీ పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి, పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న ఎల్లారెడ్డి, ఎద్దుల సాయినాథ్, అఖిల్ చారీ, వడ్డే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహానికి హాజరైన మాజీ మంత్రి )