ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం
వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగురవేసి, కార్యాలయం లో కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న యువత మోసం చేసిందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట లో విద్యార్థులు, నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో 7 నియోజకవర్గాల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీ గా వెళ్లి కలెక్టర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యులు బొల్లా మాట్లాడుతూ. అధికారం లోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం కావస్తున్న ఎన్నికల మేనిపెస్టో లో పెట్టిన ఏఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పేద విద్యార్థులు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించేందుకు దివంగత నేత వై యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వవలసిన 4.600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని డిమేండ్ చేశారు. ఎన్నికల మేనిపెస్టో లో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3 వేలు రూపాయలు భృతి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం లో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఉపసంహారించుకోవాలన్నారు . ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున యువత, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి )