వినుకొండ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది..
న్యూస్ తెలుగు /వినుకొండ : వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెండుగా గ్రూపులుగా చీలిపోయి.. కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వంలో ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవం జరపగా అందుకు పోటీగా బొల్లా ను వ్యతిరేకించే మరికొందరు ముఖ్య నేతలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. కార్యకర్తలకు ఎవరు అండగా ఉంటారు వారే నాయకులు అవుతారని నాయకత్వానికి డబ్బు కాదని ఈ సందర్భంగా బొల్లా నుద్దేశించి విమర్శలు చేశారు. ఇప్పటికే బొల్లా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన వ్యతిరేక వర్గం ఆవిర్భావ దినోత్సవం రోజున పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి వర్గపోరును భహిర్గతం చేసింది బొల్లా బ్రహ్మనాయుడు నిర్వహించే కార్యక్రమానికి మీరంతా దూరంగా ఉండటం తోపాటు వారే పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం వైసిపిలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని ఆ పార్టీలో దుమారం రేగుతుంది ఇంకా రానున్న రోజుల్లో బ్రహ్మనాయుడు కి వ్యతిరేకంగా మరికొందరు నేతలు కూడా చుండూరి వర్గంలో చేరి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తారన్న ప్రచారం కూడా ఊపు అందుకుంది. అయితే వీటన్నింటిని బొల్లా వర్గం కొట్టి పారేస్తుంది రాజకీయ పార్టీ కార్యకలాపాలు నడపాలంటే ఆర్థిక బలం అవసరమని ఆర్థిక బలం ఉన్న నాయకుడు బొల్లా అని వారు పోటీ కార్యక్రమం పట్ల చులకనగా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా వినుకొండలో ఘోర పరాజయం పాలైన వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ మనుగడ ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సారించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (Story : వినుకొండ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది..)