బాల్య వివాహాలను నివారించండి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చెందిన లక్ష్మమ్మ స్థానిక ఎమ్మార్వో తో మాట్లాడుతూ గోపాల్ పేట్ మండలం లో బాల్య వివాహాలు లేకుండా చూడాలని దానికోసం అన్ని గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శిలకు మిగతావారితో సమన్వయం చేసుకొని వాటిని ముందస్తుగా గుర్తించినట్టయితే బాల్య వివాహాలను నివారించడానికి అవకాశం ఉంటుందని,అందులో భాగంగా ఎవరైనా బాల్య వివాహాలు చేయాలన్న చూస్తే 1098కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ వాళ్ళు బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా రక్తహీనత ఏర్పడడం ఆర్థికంగా వెనుకబడటం, గృహ హింసకు గురవడం, ఉన్నత స్థానాలు అధిరోహించడానికి బాల్య వివాహాలు అద్దంకిగా మారుతాయి చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల శారీరకంగా మానసికంగా కృంగిబాటి ఏర్పడుతుంది అని అన్నారు.
కరపత్రాలను ఎమ్మార్వో చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో తిలక్ కుమార్ రెడ్డి గారు ,డీసీపీయూ సోషల్ వర్కర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. (Story : బాల్య వివాహాలను నివారించండి)