సి పి ఎల్ (చింతూరు)టోర్ని విజేతగా నిలిచిన వి.ఆర్ పురం వారియర్స్
న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో సంతపాకల క్రికెట్ గ్రౌండ్ నందు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి గ్రెజ్ బాల్(మ్యాచ్ బాల్ )క్రికెట్ టోర్నమెంట్ విజేతగా వి.ఆర్ పురం వారియర్స్ నిలిచింది.
ఈ క్రికెట్ టోర్ని ని ఐపిల్ తరహాలో చింతూరు డివిజన్ లో మంచి ప్రతిభ కనపరుస్తున్న క్రీడాకారులును వేలం వేసి ఎంపిక చేసుకుని చింతూరు క్రికెట్ క్లబ్, ఆర్ జె స్ట్రైక్ ఫోర్స్,యటపాక వారియర్స్, మోతుగూడెం క్రికెట్ క్లబ్,తుమ్మల లైగర్స్, వీఆర్ పురం చాలంజర్స్ జట్లుగా విభజించి లీగ్స్ పద్దతిలో ఈ టోర్ని నిర్వహించగా పాయింట్ల పట్టికలో లీగ్ దశలో పరాజయం లేకుండా 10పాయింట్లతో ముందంజలో ఉన్న వి.ఆర్ పురం వారియర్స్ తో 8పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచిన చింతూరు క్రికెట్ అసోసియేషన్ టీమ్ ఫైనల్ కు చేరుకోగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వి.ఆర్ పురం వారియర్స్ నుండి బ్యాటింగ్ లో ఓపెనర్ గా దిగిన గౌతమ్ 31బంతుల్లో, 4ఫోర్స్ 4సిక్సర్లతో విరుచుకుపడి 58 పరుగులు చేయగా అభి రాయ్ 45(25),సునీల్ 32(20),హరీష్ 23(14),జయంత్ 21(12)సమిష్టి రాణింపుతో నిర్ణత 20ఓవర్లలో 222 పరుగులు 8వికెట్లు కొల్పయి చేసింది. సి సి ఎ జట్టు నుండి కెప్టెన్ గణేష్ బౌలింగ్ చేసి 2వికట్లు సుబ్రహ్మణ్యం 2వికెట్లతీసుకున్నారు.భారీ చేదనలక్ష్యంగా బరిలోకి దిగిన సి సి ఏ జట్లు నుండి సుబ్రహ్మణ్యం 10బంతుల్లో 5 ఫోర్స్ తో 20పరుగులు చేయగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ లో 19బంతుల్లోనే అర్ధసెంచిరి చేసిన రవ్వ ప్రవీణ్ ప్రకాష్ దాటిగా ఆడుతూ 4ఫోర్లు, ఆరు సిక్సర్లతో 23 బంతుల్లో 58పరుగులు చేసినప్పటికి మిగతా బ్యాట్స్మెన్స్ వరుస వికట్లు కోల్పోయింది. చివరి వికట్ కు భారీ పాట్నర్షిప్ ఇచ్చిన వినోద్24(29)శంకర్ 30(26) పోరాడి 19.2బంతుల్లో 191పరుగులు చేయగా వి .ఆర్ పురం వారియర్స్ జట్లు 31 పరుగుల తేడాతో సి పి ఎల్ టోర్ని సీజన్ 1 విజేత గా నిలిచింది. బౌలింగ్ లో వి .ఆర్ పురం వారియర్స్ జట్లు నుండి నిఖిల్ 3వికె ట్లు,జయంత్ 2 వికెట్లు, జయ్ 2వికెట్లతో రాణించారు.టోర్ని ఫైనల్ లో మాన్ అఫ్ ద మ్యాచ్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన సునీల్ (వి ఆర్ పురం వారియర్స్)కు దక్కింది.
అనఁతరం సిపిల్ టోర్ని నిర్వాహకులు విజేతలగా నిలిచిన జట్లకు విన్నర్ రన్నర్ కప్ లతో పాటు మొదటి బహుమతి గా రూ.30000/-, ద్వితీయ బహుమతి రూ. 20000/- దాతల సహాయంతో అందించారు. బెస్ట్ బ్యాటర్ గా వి ఆర్ పురం వారియర్స్ నుండి గౌతమ్ 7మ్యాచ్ లకు 234 పరుగులు, బెస్ట్ బౌలర్ సి సి ఎ టీమ్ కెప్టెన్ గణేష్ 6ఇన్నింగసులకు 11 వికెట్లు, బెస్ట్ ఫీల్డర్ పి శేఖర్ ఎటపాక వారియర్స్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ సునీల్ వి ఆర్ పురం వారియర్స్ నిలిచారు.ఈ బహుమతి కార్యక్రమంలో వైస్ ఎం పి పి చిన్ని, మడివి రాజు (జనసేన ) సీనియర్ క్రికెట్ క్రీడాకారులు షాహింషా,సొంది నాగేశ్వరరావు,చిన్నబ్బి,సి సి ఎ గణేష్,ప్రదీప్,రమేష్. పి,సూరి,బుచ్చిరాజు,శంకర్, సురేష్ పిసి, గంగారాజు, బిట్టు, అంజు, అర్జున్, వర్షిత్,పాల్గొన్నారు. (Story : సి పి ఎల్ (చింతూరు)టోర్ని విజేతగా నిలిచిన వి.ఆర్ పురం వారియర్స్)