ప్రజా పోరాటాలకి గిరిజనులను ఐక్యం చేయడమే ముత్యం ఇచ్చే ఘనమైన నివాళి – సిపిఎం
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన, ప్రజల్ని చైతన్యం చేయడం , ఏజెన్సీ ప్రాంత హక్కులు చట్టాలు కాపాడుకోవడం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గిరిజనుల ఐక్యం ప్రజా పోరాటాల నిర్వహించడమే అమరజీవి పట్రా ముత్యం కిచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ తెలిపారు.
సోమవారం నాడు తుమ్మల గ్రామంలో కామ్రేడ్ మొట్టుం రాజయ్య అధ్యక్షతన అమరాజీవి పట్రా ముత్యం 11వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సీసం సురేషు లు మాట్లాడుతూ తుమ్మల చిడుమూరు ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పట్రా ముత్యం ఎర్రజెండా చేత పెట్టి ప్రజా పోరాటాలు నిర్వహించి సమస్యల పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో గొప్ప నాయకుడుగా ఉండేవాడిని కొనియాడారు. కేంద్ర పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సిపిఎం విధానాలకి ఆకర్షితులై ప్రజల అభివృద్ధికి గ్రామాల్లో మౌలిక సౌకర్యాల పరిష్కారానికి అధికారులతో పోరాడేవాడని తెలిపారు. డోలు కొయ్యలు కలని కళాకారులని దేశానికి పరిచయం చేసి తుమ్మల గ్రామానికి మంచి పేరుని తీసుకొచ్చారని తెలిపారు. అటువంటి నాయకుడిని నరహంతక నక్సలైట్లు అర్ధరాత్రి హత్య చేసే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులని విచ్ఛిన్నం చేసి ఏజెన్సీ ప్రాంత సంపదలను కార్పొరేట్లకు దోచిపెట్టడమే కాకుండా, గిరిజనుల అభివృద్ధికి పాటుపడడం లేదని తెలిపారు. ఇటువంటి తరుణంలో ఏజెన్సీ ప్రాంత హక్కుల చట్టాలు కాపాడుకునేందుకు, గిరిజనుల అభ్యున్నతికి గిరిజన ఐక్యం చేసే ప్రజా పోరాటాల నిర్వహించడమే ముత్యం కు ఇచ్చే ఘనమైన నివాళి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుమ్మల ఎంపీటీసీ వేక రాజ్ కుమార్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మణ్, మండల కమిటీ సభ్యులు పట్రా రమేష్, మొట్టమ్ నాగేశ్వరావు,శాఖా కార్యదర్శులు లెనిన్, గణేష్, పొద్దయ్య, కిట్టయ్య, దుర్గారావు, కుటుంబ సభ్యులు రాధాకృష్ణ, పాపారావు, జయ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజా పోరాటాలకి గిరిజనులను ఐక్యం చేయడమే ముత్యం ఇచ్చే ఘనమైన నివాళి – సిపిఎం)

