మహిళల విద్య వ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
న్యూస్తెలుగు/వనపర్తి : సమాజంలో మహిళల విద్య వ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన తొలి ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, బీసీల ఆరాధ్య దైవం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఘనంగా నివాళులు అర్పించారు. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ నివాసం దగ్గర సభ్యులందరూ సమావేశమై సావిత్రిబాయి పూలే పటం పెట్టి దండ వేసి పూలతో ఘనంగా అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు నివాళులు అర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడబిడ్డలకు విద్యా ప్రదాత అయిన సావిత్రి బాయి పూలే గారు వారి చదువు చెప్పడమే కాక, కాక సాంఘిక దురాచారాలు పై పోరాడిన తొలి మహిళ అని, స్త్రీల హక్కులకై పోరాడి, సమాజానికి ఆదర్శ మహిళగా పేరు తెచ్చుకున్నరని, బీసీల ఆరాధ్య దేవత అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,బీజేపీ నేత రాజానగరం రవి, పుట్టపాక బాలు, శివకుమార్ ,కృష్ణయ్య,నాగరాజు, రామస్వామి,శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : మహిళల విద్య వ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే)