ముస్లిం సహోదరుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు రాజీవ్ గాంధీ సెంటర్ లో కూలింగ్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ముస్లిం సోదరులు ఏర్పాటు చేశారు. వేసవి ఎండ తీవ్రత అధికం కావడంతో యాత్రికులు, ప్రయాణికులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు సోమవారం యాసీన్ మస్జీద్ ముస్లిం సహోదరులు విద్యుత్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమంలో మస్జిద్ గురువు ఇజా అహ్మద్, షేక్ సుభాని, ఎండి జోహర్, ముర్షిద్ద్, కరీముల్లా, దస్తగీర్ తదితరులు పాల్గొన్నారు.(Story : ముస్లిం సహోదరుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు)