ఈ నెల 12న జరిగే “ఫీజుపోరు” జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్యే బొల్లా పిలుపు
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విద్యార్థి విభాగం నాయకులు మరియు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “ఫీజుపోరు” పోస్టర్ ను సోమవారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ. 3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కారణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోడంతో విద్యార్థులు చదువులు కొనసాగించలేక, పనులకు వెళ్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు అన్యాయం చేస్తుంటే దీన్ని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సహించబోదు, పోరాడుతుందని తెలిపారు. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై నిరసనగా ” మార్చ్ 12 ” విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి విద్యార్థి మరియు విద్యార్థి తల్లిదండ్రులు మరియు వైయస్ ఆర్ సీపీ నాయకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధికార ప్రతినిధి ఎం ఎన్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, గంధం బాలిరెడ్డి, నాయకులు పగడాల వెంకటరామిరెడ్డి, రాజా, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story ; ఈ నెల 12న జరిగే “ఫీజుపోరు” జయప్రదం చేయండి)