మావోయిస్టు కన్నయ్య గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్
న్యూస్ తెలుగు/చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏ యస్ పి పంకజకుమార్ మీనా ఆధ్వర్యంలో సోమవారం చింతూరు మండలంలోని మారుమూల కుగ్రామమైన కలిగొండ గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇది అరెస్టయిన మావోయిస్టు కాక కన్నయ్య గ్రామం. ఈ కార్యక్రమంలో వృద్దులకు దుప్పట్లు, బట్టలు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఆ గ్రామంలో వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు వస్తుందీ లేనిదీ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ తెల్లం దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story: మావోయిస్టు కన్నయ్య గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్)