స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్షీణిస్తున్న పారిశుధ్యం
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజా సేవే మా కర్తవ్యం అంటూ ఆర్టీసీ అధికారులు. స్వచ్ఛభారత్ అంటూ మున్సిపల్ అధికారులు గాంభీరాలు పలకటమే గాని వాస్తవ రూపంలో పరిశుభ్రత ఎక్కడా కనిపించడం లేదని ఆర్టీసీ ప్రయాణికులు విస్తు పోతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన ముఖ ద్వారాలు వద్ద పారిశుధ్యం తీవ్రస్థాయిలో లోపించి బస్టాండ్ లోకి వచ్చి పోయే ప్రయాణికులు ముక్కులు మూసుకొని వెళుతున్నారు. మూత్ర విసర్జన టాయిలెట్స్ లో నీటి సరఫరా సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ. ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తక్షణం అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణలో పారిశుధ్యం మెరుగుపరచాలని ప్రజల కోరుతున్నారు. (Story : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్షీణిస్తున్న పారిశుధ్యం)