స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అంజన బోటిక్స్ లేడీస్ టైలర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా టైలర్ కే. అంజనా ను పట్టణంలోని టైలర్లు మరియు మహిళా టైలర్ల ఆధ్వర్యంలో దుశ్యాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్ కే యం డి హుస్సేన్ (బాండ్) మరియు కార్యదర్శి చిమ్మన గోవిందరాజులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని విద్యా, ఉద్యోగం, వైద్యం, రాజకీయం ,వ్యాపారం పారిశ్రామిక రంగం తదితర రంగాలలో మగవారికి దీటుగా రాణిస్తున్నారని. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారని అటువంటి మాతృమూర్తులకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళా టైలర్ లను సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ నారాయణ, కారుపల్లి ఆంజనేయులు, గద్దల వందనం, వి.ఎస్.ఆర్ సీతారామయ్య, కోటయ్య ఎస్కే మస్తాన్, పట్టణ టైలర్లు మరియు మహిళా టైలర్లు పాల్గొన్నారు (Story : స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు)