Homeవార్తలు "త్రీ రోజెస్ " సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

 “త్రీ రోజెస్ ” సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

 “త్రీ రోజెస్ ” సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. త్రీ రోజెస్ సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో ఈ రోజు వుమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

త్రీ రోజెస్ సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో ఎలా ఉందో చూస్తే…’ హర్ష, ఈషా రెబ్బా ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తూ మాట్లాడుకుంటుంటారు. మిగిలిన 2 రోజెస్ గురించి హర్ష అడగగా..ఇందు కు పెళ్లయ్యిందని, జాను కబీర్ తో టూర్స్ అంటూ తిరుగుతోందని ఈషా చెబుతుంది. నువ్వు సింగిల్ గా ఉన్నావు కదా అని హర్ష అడగగా..సింగిల్ కాదు ఇప్పుడు కూడా ఇద్దరున్నారు. ఈ సారి ఫన్ మామూలుగా ఉండదు అని చెప్పి షాక్ ఇస్తుంది. ఇలా త్రీ రోజేస్ సీజన్ 2 టీజర్ ఫన్ తో పాటు కావాల్సినంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కు అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నారు.(Story :  “త్రీ రోజెస్ ” సీజన్ 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!