ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోశనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.కె. రత్న మాణిక్యం విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళ హక్కుల ఉద్యమ చరిత్రలో ఒక మలుపును సూచిస్తుందన్నారు . పునరుత్పత్తి హక్కులు, లింగ సమానత్వం, మహిళలపై హింస, దుర్వినియోగ నివారణ వంటి ముఖ్యమైన సమస్యలపై మహిళా శక్తి సంఘటితంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్. ఎం శేఖర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళా ఒక మగాడి విజయం వెనుక ఒక తల్లి చెల్లి అక్క కూతురు ఇలా ఎవరో ఒక స్త్రీ మూర్తి ఉండే సమసమాజ స్థాపనలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపారు. చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ శక్తివంతమైన స్త్రీమూర్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు.మహిళ సాధికారత సమన్వయకర్త కె.శైలజ మాట్లాడుతూ అమ్మ స్థానంలో ఉండి తన జీవితాన్ని కుటుంబ సభ్యుల అభివృద్ధికి త్యాగం చేస్తుందన్నారు. కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ నూనె రమేష్ మాట్లాడుతూ మహిళలు కుటుంబ వ్యవస్థలో ఒక బలమైన శక్తి తన కోసమే కాదు ఇతరుల కోసం కూడా నిలబడుతుంది, పోరాడుతుంది అని తెలిపారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు జి.వెంకటరావు,డాక్టర్.వై.పద్మ,కె.శకుంతల, జి. సాయికుమార్
, యస్.అప్పనమ్మ, యం. నాగమోహనరావు,జి.హారతి,కె శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి, రాజబాబు, బి.శ్రీనివాసరావు తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ , విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం)