గీతాంజలి స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను గంగినేని కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జి. వి. ఆంజనేయులు చిన్నారులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి అని కోరారు. గత సవత్సరం 10వ తరగతిలో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు పురస్కారలు అందజేసి ఘనంగా సత్కరించారు .ఈ సందర్బంగా ప్రముఖ సైకాలాజిస్ట్ మరియు కెరీర్ కౌన్సెలర్ డా. ప్రత్యుష సుబ్బారావు విద్యార్థుల నిద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఖచ్చితమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలి అని, పదవ తరగతి నుండే మంచి మార్కులు సాధించి మంచి పునాదిని వేసుకోవాలి అని కోరారు. తల్లిదండ్రులను, గురువులను ఎప్పుడు అగౌరాపరచకూడదు అని మరీ ముఖ్యంగా ఆడ పిల్లలను ఎట్టి పరిస్థితులలో కించపరిచే విదంగా చూడకూడదు అని, మన ఇంట్లో ఆడ వారిని ఎలా గౌరవిస్తామో ఆలా వారిని గౌరవించాలి అని కోరారు. అలాగే విజ్ఞాన్ విద్యాసంస్థల నుండి విచ్చేసిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ. క్రమశిక్షణతో కూడిన విద్యతో మంచి లక్ష్యాలను చేరుకోవాలి అని కాలేజీ చదువు లో మంచి మిత్రులను ఏర్పరచుకొని ముందుకు సాగాలి అని, ఎట్టి పరిస్థితులలోను చెడు వైపు ఆకర్శించ కుండా మంచి పునాదిని ఏర్పాటు చేసుకోవాలి అని కోరారు. గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ వై. శేషగిరి రావు మాట్లాడుతూ సినిమా ప్రభావం తో విద్యార్థులు చెడిపోతున్నారాని అది మంచి పరిణామం కాదు అని హితవు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి, కారాస్పాండంట్ వై. లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ)