చింతూరు లోఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం
న్యూస్ తెలుగు /చింతూరు : ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతూరు డివిజన్ కేంద్రం లో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు .
ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గుజ్జా సీతమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. అలానే పీహెచ్ఈలలో దీర్ఘకాలికంగా సేవలందిస్తున్న ఉద్యోగులను విశేష సేవా పురస్కారంతో సన్మానించడం. సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ మహిళలే సమాజానికి మాతృమూర్తులని, ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ మండల అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ నిర్మాణంలో తల్లిపాత్ర మహిళల పాత్ర అపురూపమైనదని మహిళలు నిర్దేశించిన విధంగానే సమాజం ప్రవర్తిస్తుందని ఆ పెట్టి పిల్లల సంరక్షణలో సమాజ నిర్మాణంలో మహిళలు బాధ్యత యువతమైన పాత్రను పోషించాలని, అలానే మహిళా ఆరోగ్య సంరక్షణ విషయంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి రాష్ట్ర చైర్మన్ రాజబాబు మాట్లాడుతూ ప్రతి తల్లి వైద్యశాలల్లోనే ప్రసవం జరిగేలా చూడాలని బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులు ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా గొప్పగా వహిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి ఏ ఎస్ ఆర్ జిల్లా కన్వీనర్ రామారావు దొర మాట్లాడుతూ సమాజంలోని పురుషులు అందరూ కూడా ప్రతి మహిళను అక్కగాను చెల్లిగానో తల్లిగానో చూడగలిగిన రోజు మహిళలకు సంపూర్ణ భద్రత రక్షణ అందజేయడం సాధ్యమవుతుందని మనందరి బాధ్యతని స్పష్టం చేశారు. ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం నిజంగా మహిళలది మాత్రమే కాదని, యావత్ సమాజం ఘనంగా నిర్వహించుకోగనదని, అందుకే ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి గణంగా నిర్వహించుకోవడానికి పూనుకున్నామని స్పష్టం చేశారు. సలహాదారులు మడివి నెహ్రూ మాట్లాడుతూ.. మన సమాజం ఏ స్థితికి చేరుకొని మహిళలు ఎంత స్వేచ్చగా సాధికారతతో మొనగలుగుతున్నారంటే పూలే దంపతుల కృషితోపాటు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్ర చాలా గొప్పదని, ఈ కారణంగానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా శాఖపరమైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయాల్సిందిగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరిగింది. అలానే గౌరవ అతిథిగా విచ్చేసిన చింతూరు ఎస్సై రమేష్ కి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందిగా వినతి పత్రం ఏ ఎస్ పి గారికి అందజేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్లోని 4 మండలాల్లోని అన్ని పీహెచ్సీలకు సంబంధించిన ఐజి ఆరోగ్య శాఖకు సంబంధించిన మహిళా ఉద్యోగులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. (Story : చింతూరు లోఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం)