మహిళలకూ సమాన హక్కులు కల్పించాలి
న్యూస్ తెలుగు/ సాలూరు : మహిళలపై లింగ వివక్ష చూడకుండా సమాన హక్కులు కల్పించాలని ఆ హక్కులు వచ్చేవరకు మహిళలందరూ చైతన్యంతో పోరాడాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్
బలగ రాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలరాధ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సాలూరు ఎమ్మార్వో ఆఫీస్ కోడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై హత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. గృహింస లైంగిక వేధింపులు లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రేమ పేరుతో వంచించి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి దాడులు మహిళలపై బాలికలపై ఆగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చట్టాలను సెక్షన్లను బలోపేతం చేసి నేరస్తులకి కఠిన శిక్షలు విధించాలని అన్నారు. మహిళలపై దాడులకు పాల్పడ్డ మృగాలకు బుద్ధి చెప్పొలని తెలిపారు. అంతేకాకుండా ఒక మహిళకు గానీ ఒక బాలిక గాని అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు చట్టాన్ని తన పని తను చేసుకోనివ్వకుండా పోలీసుల్ని నిజాయితీగా ఉండనివ్వకుండా కొంతమంది ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని వాడు మా వాడు వీడు మా వాడు అంటూ నేరం చేసే వాళ్ళని వెనకేసుకురావడం మానుకుంటే మంచిదని అన్నారు. మహిళలపై లింగ వివక్ష చూపరాదని మహిళకు సమాన హక్కు కల్పించాలని అన్నారు. ఇలాంటి మహిళా దినోత్సవం మాత్రమే అడగటం కాదని ప్రతి మహిళలో చైతన్యం రావాలని అన్నారు. ఆడపిల్లని కనాలి ఆడపిల్లని చదివించాలి ఆడపిల్లని రక్షించాలి అనే నినాదంతో ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో పూర్తి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. (Story : మహిళలకూ సమాన హక్కులు కల్పించాలి)