పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు
పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాత బస్టాండ్ పున ప్రారంభించడానికి అధికారులు గుత్తేదారులు పని ప్రారంభించడంతో మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు అక్కడికి వెళ్లి పనులు పరిశీలించి అధికారులను విషయం అడిగి తెలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు సంతోషపడుతున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని ఇబ్బంది కలిగినచో అక్కడే పోరాటం మొదలవుతుందని అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అక్కడ 40 సంవత్సరాల నుండి చిరు వ్యాపారం చేసుకున్న వారికి కూడా సౌకర్యాలు కల్పించాలని వారికి తగు రక్షణ కల్పించాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు రాష్ట్ర టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, పుట్టపాక బాలు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. (Story : పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు)