మావోయిస్టుల కోటలోకి సిఆర్పిఎఫ్, డి ఆర్ జి బలగాలు ప్రవేశం
మావోయిస్టుల స్మారక స్తూపాన్ని జెసిబి తో కూల్చిన జవాన్లు
న్యూస్ తెలుగు/చింతూరు : మావోయిస్టుల కంచుకోట అయిన బీజాపూర్ జిల్లాలోని అంతర్గత ప్రాంతమైన పూజారి కాంకేర్ లో జవాన్లు ప్రవేశించి మావోయిస్టుల స్మారక స్థూపాన్ని కూల్చి వేశారు. వుసూర్ బ్లాక్ లోని పూజారి కంకేర్ అడవుల్లో ప్రవేశించి మావోయిస్టుల స్మారక స్థూపాన్ని కూల్చి వేశారు.కొద్దీ రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మావోయిస్టులకు,పోలీసు జవాన్లకు ఎదురు కాల్పులు జరిగి పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతం తెలంగాణ- చతిస్గడ్ సరిహద్దుల్లో ఉంది. ఈ ప్రదేశంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపును ఇటీవల ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో 90 అడుగుల ఎత్తైన మావోయిస్టు నాయకుడి స్థూపాన్ని కూడా కుల్చి వేశారు. గత ఏళ్ళ నుండి బస్తర్ డివిజన్లోని వివిధ జిల్లాల్లో నిర్మించిన 300 స్థూపాలను జవాన్లు కూల్చి వేశారు. భద్రత దళాలు ఒకపక్క మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ, వారి జ్ఞాపక స్టూపాలను తుడిచిపెడుతున్నాయి. నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం ఎస్పి ప్రభాత్ కుమార్ ఎదుట 11 మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. వీరిపై 40 లక్షల రివార్డ్ ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. (Story : మావోయిస్టుల కోటలోకి సిఆర్పిఎఫ్, డి ఆర్ జి బలగాలు ప్రవేశం)