దృష్టిలోపం లేకుండా చూసు కోవాలి
డా. ఉదయ్ కుమార్ రెడ్డి
న్యూస్ తెలుగు/చింతూరు : చదువుకునే విద్యార్థులు ఎప్పటికప్పుడు దృష్టిలోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్లో కంటి పరీక్షలు నిర్వహించిన విద్యార్థులకు కళ్ళజోళ్ళు ఉదయ్ కుమార్ రెడ్డి, కంటి వైద్యనిపుణులు కిషోర్, స్కూల్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కొత్త విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు శారీరికంగా పరిశుభ్రతగా ఉండాలన్నారు. స్కిన్ ఎలర్జీ ఉన్నవారు ఒకరు వాడిన దుప్పట్లు, టవళ్లు, దిడ్లు వాడ రాదన్నారు. తడి బట్టలు వేసుకో రాదన్నారు. వేసవికాలంలో ఎక్కువ నీళ్లు తాగాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకొని ఒక లీటర్ బాటిల్ నీళ్లలో కలుపుకొని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, హెచ్ఈఓ ముక్తేశ్వరరావు, హెచ్. వి సరోజిని, హెచ్ యస్ కే. గంగరాజు, ఏఎన్ఎంలు జయ, వెంకటేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.(Story : దృష్టిలోపం లేకుండా చూసు కోవాలి)