చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పారిశ్రామిక సందర్శన
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమలు కర్మాగారాల పట్ల అవగాహన కల్పించట కొరకు మోతుగూడెంలోని ఎ పి జన్ కో విద్యుత్ తయారీ కేంద్రానికి వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ సందర్శనకు సమన్వయ కర్తగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ విద్యార్థులకు విద్యుత్ తయారీ విధానం పై అవగాహన కల్పించారు. ఎ పి జన్ కో ఇంజనీర్లు విద్యార్థులను విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లోనికి తీసికువెళ్లి తయారీలోని వివిధ దశలను, విద్యుత్ సరఫరా మార్గాలను కూలంకుషంగా వివరించారు. తరువాత విధ్యార్థిని విధ్యార్థులు పోర్ భే జలాశయం, పొల్లూరు జలపాతం సందర్శించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు యస్ అప్పనమ్మ,కె. శైలజ జి.హరతి,యన్.రమేష్, యం. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పారిశ్రామిక సందర్శన)