Home వార్తలు మార్చి 10 నుంచి ‘స్టార్ మా’లో సరికొత్త ధారావాహిక ‘‘మా’ ఇంటి మాలక్ష్మి..భానుమతి’

మార్చి 10 నుంచి ‘స్టార్ మా’లో సరికొత్త ధారావాహిక ‘‘మా’ ఇంటి మాలక్ష్మి..భానుమతి’

0

మార్చి 10 నుంచి ‘స్టార్ మా’లో సరికొత్త ధారావాహిక ‘‘మా’ ఇంటి మాలక్ష్మి..భానుమతి’

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  మనం చెప్పే ప్రతి అంశం సమాజంపై మంచి ప్రభావాన్ని చూపాలని ఆలోచించే స్టార్ మా మరోసారి తన సామాజిక బాధ్యతను నిరూపించుకుంది. సీరియల్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు విలక్షణమైన కథతో పాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం వంటి విలువలతో కూడుకున్నది ఉండేలా స్టార్ మా ముందు నుంచి అడుగులు వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్టార్ మాలో అందించిన పాత్రలుసాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బాధ్యత, నిజాయతీ, కరుణ, దయ వంటి వాటిని మనకు చూపిస్తూ వచ్చాయి. వీటి కోవలోకి మరో కొత్త పాత్ర వచ్చి చేరబోతోంది. ఆ పాత్రే ‘భానుమతి’. మనం ఎగరాలని బలంగా అనుంటే రెక్కలు వాటంతట అవే వస్తాయని రుజువు చేసే అమ్మాయి కథే ఇది.

చదువే జీవితానికి వెలుగు చూపించే దీపం అని నమ్మే అమ్మాయే భానుమతి. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది ఆమె కల. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భానుమతి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. వాటిని ధైర్యంగా ఎలా అధిగమించిందో చెప్పే కథ ‘భానుమతి’. ఈ సరికొత్త ధారావాహిక మార్చి 10 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.

తెలుగు సంప్రదాయాల ప్రకారం మన కుటుంబాల్లో ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటాం. అందుకనే ‘భానుమతి’ కథకి ‘మా ఇంటి మాలక్ష్మి’ అనే ట్యాగ్ లైన్‌ను పెట్టారు. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతుంది. (Story : మార్చి 10 నుంచి ‘స్టార్ మా’లో సరికొత్త ధారావాహిక ‘‘మా’ ఇంటి మాలక్ష్మి..భానుమతి’)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version