ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళ సాధికారతపై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కళాశాల మహిళా సాధికారత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అవగాహన సదస్సునిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం, సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ విధ్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు చరవాణిలు ద్వారా తమ,తమ సొంత విషయాలను ఇతరులకు పంపడం ద్వారా నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాల బారిన పడుతున్నారని,డ్రగ్ మాఫియా నేపథ్యంలో విద్యార్థులు తమ జీవితాన్ని ,
భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ రాత్రి సమయాల్లో స్త్రీలు ప్రయాణాలు చెయ్యటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అటువంటి సందర్భాలలో పోలీసులను సంప్రదించాలని కోరారు.ప్రతి మహిళా చరవాణిలో పోలిస్ వారి యాప్ ను అనుసంధానం చేసుకోవాలనీ యాప్ ప్రమాదకరం నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.మహిళలపై అఘాయిత్యం జరుగుతుందని భావిస్తే వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేస్తే రక్షణ కల్పిస్తారన్నారు.డ్రగ్స్ మత్తులో పడి విద్యార్థులందరూ తమ జీవితాలను, భవిష్యత్తు ను నాశనం చెసుకోవడం మంచిది కాదన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యం శేఖర్ మాట్లాడుతూ జాతీయ మహిళా సాధికారత పై అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కలుగుతుందన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ చేతులు మీదుగా మహిళా సాధికారతపై జరిగిన వక్తృత్వ పోటీలో ప్రతిభ కనబరిచిన విధ్యార్దినులకు ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు జి.వెంకటరావు,డాక్టర్.వై.పద్మ,కె.శకుంతల,కె శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి, జి.హరతి,యన్.రమేష్, నాగమొహనరావు , రాజబాబు,బి.శ్రీనివాసరావు తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విధ్యార్థినీ విధ్యార్థులు పాల్గొన్నారు. మహిళా సాధికారత సమన్వయకర్త కె.శైలజ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.(Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళ సాధికారతపై అవగాహన సదస్సు)