మహిళలను గౌరవించే బాధ్యత అందరిది
న్యూస్ తెలుగు/ఈపూరు: మహిళలే సృష్టికి మూల కారణమని వారి ఓర్పు సహనం కుటుంబ ఎదుగుదలతో వారి పాత్ర మహాగొప్పదని,మహిళలను గౌరవించే బాధ్యత ప్రతి పౌరుడిపై వుందని సిడిపిఓ బి అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన ఈపూరు మార్కెట్ యార్డు నందు మంగళవారం మహిళల పై అవగాహన కార్యక్రమాన్ని మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో న్యూట్రిషన్ యోగ మిల్లెట్స్ హెల్త్ డైట్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముప్పాళ్ళ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ నవీన్ హాజరై బ్యాలెన్స్ డైట్ న్యూట్రిషన్ ఫుడ్ శరీరం గ్రహించగలిగిన ఆహార పదార్థాలు ఆహార వినియోగం ఆహార సమయపాలన వంటి విషయాలు గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. అనంతరం సిడిపిఓ బి అరుణ మాట్లాడుతూ సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని,స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలుదొక్కునేటట్లు చేయొచ్చని,స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండాలని,మహిళ సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. యోగ ఉపాధ్యాయులు యోగ ఆవశ్యకత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కే చిన్నమ్మాయి వి శ్రీదేవి కె రాజ్యలక్ష్మి ఎస్.కె మస్తాన్ బి ఆర్ పద్మజారాణి అంగన్వాడీలు పాల్గొన్నారు. (Story : మహిళలను గౌరవించే బాధ్యత అందరిది)