ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల , స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థినీ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, వినుకొండ ప్రభుత్వ సుపత్రి సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ అబ్దుల్ రజాక్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి .శివ ఫణీంద్ర, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ రామ కిషోర్ బెహరా, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం)