అల్వాల గ్రామ దేవత కోట మశమ్మ దేవతను దర్శించుకొన్న రావుల
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం ఆల్వాల గ్రామములో జరిగిన పెద్దమ్మ పండుగ సందర్భంగా గ్రామదేవత కోట మశమ్మను మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవత ఉత్సవాలు(జాతర) ప్రజలలో భక్తిభావాలు పెంపొందించడంతో పాటు ఐక్యత కలిగిస్తాయని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవాలయాన్ని నిర్మించి ఉత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను సహకరించిన గ్రామ పెద్దలు ఆల్వాల.వెంకట్ రెడ్డి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,బి.ఆర్.ఎస్ నాయకులు రాజవర్థన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,ఎం.డి.గౌస్ కొత్తకోట.బాలయ్య తదితరులు ఉన్నారు.(Story : అల్వాల గ్రామ దేవత కోట మశమ్మ దేవతను దర్శించుకొన్న రావుల )