Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఓపెన్ హౌస్ నిర్వహించిన చింతూరు ఏఎస్పీ

ఓపెన్ హౌస్ నిర్వహించిన చింతూరు ఏఎస్పీ

ఓపెన్ హౌస్ నిర్వహించిన చింతూరు ఏఎస్పీ

న్యూస్ తెలుగు / చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా చింతూరు ఏ ఎస్ పి కార్యాలయంలో శనివారం డిగ్రీ విద్యార్థినిలకు ఎ ఎస్పీ ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగాఎ ఎస్పి పంకజ్ కుమార్ మీనా , సి ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మార్చ్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు మహిళా వారోత్సవాల నిర్వహణ, 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తమ పోలీస్ స్టేషన్ లో మహిళల హక్కులు, మహిళా అధికారిత, మహిళా చట్టాలు, విద్యార్థి నుల ర్యాగింగ్, తదితర అంశాలపై ఎ ఎస్పి వివరించారు. సిఐ ఆధ్వర్యంలో ఆఫీస్ నిర్వహణ, లాకప్, సాంకేతిక నిర్వహణ, ఆయుధాలు వినియోగం, పై ఓపెన్ హౌస్ నిర్వహించినట్లు తెలిపారు. ఎ ఆయుధం ఎలా పనిచేస్తుందో స్టూడెంట్స్ కు వివరించారు. అలాగే పోలీసులు అధికారుల పేర్లు స్థాయి వివరాలను తెలియజేశారు,విద్యార్థులను ముచ్చటిస్తూ పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, అలాగే మావోయిస్టులకు , వారి భావాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ యస్ పి పంకజ్ కుమార్ మీనా తో పాటు, సి ఐ తెల్లం దుర్గాప్రసాద్, యస్ ఐ రమేష్, ఏఎస్ఐ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిపిఎం నాయకులు ఎర్రం శెట్టి శ్రీనివాస్ రావు , శాపిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ అహమద్ అలీ తదితరులు పాల్గొన్నారు. (Story : ఓపెన్ హౌస్ నిర్వహించిన చింతూరు ఏఎస్పీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!