ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పూర్తి
భారీ జన సమీకరణ లో కాంగ్రెస్
పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 2 న పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు,శుక్రవారం ఆయన పాలిటెక్నిక్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ దగ్గరుండి పర్యవేక్షించారు, భారీ జన సమీకరణకు సంబంధించి ఆయా మండలాల నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాట్లకి సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు,అధికారులతో సమన్వయం చేస్తూ మొదటిసారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలన్నారు,ముఖ్యమంత్రి రాక సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కార్యక్రమం, ముఖ్యమంత్రి చిన్ననాటితనంలో అద్దెకిరాయి ఇంట్లో విద్యాభ్యాసన చేసిన అప్పటి ఇంటి యజమాని పార్వతమ్మ ఇంటి పరిశీలన, క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు, జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను, ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి ఎనుముల రేవంత్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన పిలుపునిచ్చారు,కాంగ్రెస్ పార్టీ పట్ట నాయకులు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు ఉన్నారు, (Story : ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పూర్తి)