ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 42వ వార్షికోత్సవ మహాసభ ఏనుగుపాలెం రోడ్డు లోని మార్కెట్ యార్డు నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్జీ పతాక ఆవిష్కరణను సీనియర్ దర్జీ సీతారామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కుట్టు మిషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఇలియాస్ హువే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టైలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిజేటి నాగ శ్రీను రాయల్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోయపాటి రామాంజనేయులు, టిడిపి పట్టణ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని పరిష్కరించే విధంగా తీసుకోవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కూటమి ప్రభుత్వంలో టైలర్లకు అందవలసిన పథకాలాన్ని అందే విధంగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తో మాట్లాడి పరిష్కరిస్తామని జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు తన తరఫున అండగా ఉంటానని టైలర్ లకు ఎప్పుడు తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు బాండ్ టైలర్ ఈ ఎండి హుస్సేన్, ఉపాధ్యక్షులు ఎస్కే రబ్బాని మోనో టైలర్, సంయుక్త కార్యదర్శి సయ్యద్ జిలాని, కోశాధికారి టి నారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కారుపల్లి ఆంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ ఖాసిం సాహెబ్, గద్దల వందనం, టైలర్స్ పెద్దలు మోతాదు సైదా, షేక్ బాబు, బత్తుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా టైలర్స్ డే వేడుకలు..)