జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముగిసిన సైన్స్ ఎగ్జిబిషన్ వేడుకలు..
న్యూస్ తెలుగు /వినుకొండ : సైన్స్ డే.. సర్ సి. వి. రామన్ 1928 ఇదే రోజున రామన్ ఎఫెక్ట్ ప్రకటించి, ఆమోదం పొందిన రోజు. అందుకే మన ప్రభుత్వం ఈ రోజును సైన్స్ డే గా ప్రకటించారని మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. స్థానిక జీవాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వారం రోజులపాటు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రామన్ ఎఫెక్ట్ అనగా ” దృవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందినవో వివరించే ప్రయోగం “. దీనికిగాను వారికీ 1930లో నోబెల్ బహుమతి ఇచ్చారు.. మరియు లెనిన్ శాంతి బహుమతి కూడా ఇచ్చారు. 1954లో భారత రత్న బిరుదు కూడా ఇచ్చారు.. సైన్స్ అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పధం లో పయనిస్తుంది… ఎన్నో అంశాలలో వ్యవసాయ రంగంలో క్రొత్త పోకడలు, అంతరిక్షం లో ఆధిపత్యం ఇలా ముందుకు పోవచ్చును, నేటి బాలలు సైన్స్ లో పట్టు సాధిస్తూ, ఉన్నత విలువలు కలిగి, గొప్ప సైన్టిస్ట్ లు కావాలని ఎంఈఓ జఫ్రూల్లా వివరించారు.. అనంతరం మండల విద్యా శాఖధికారి సయ్యద్ జఫురుల్లా విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు. ప్రిన్సిపల్ బాల శౌరయ్య మాట్లాడుతూ. ఇటువంటి ఎగ్జిబిషన్ను ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటి ఏర్పాటు వలన విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భవిష్యత్తులో శాస్త్రీయ దృక్పథం పెరిగి శాస్త్రజ్ఞులుగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థిని విద్యార్థులు అగ్ని పర్వత లావా వెదజల్లట,గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్ర పిండాలు, పంబాన్ బ్రిడ్జి, అక్వేరియం, కరెంటు లేకుండా ఆక్సిజెన్ పంపుట. ఇరిగేషన్,, డ్రిప్ ఇరిగేషన్, గ్రహాలు లాంటి వర్కింగ్ మోడల్స్, చార్మినార్, తాజమహల్, సాంచి స్తూప, హిస్టరికల్, ఇండియా వాటర్ రిసోర్స్, మన నివాసాలు, ట్రాఫిక్ , నీటి స్థితులు, మొక్క పెరుగుదల, మురికి నీరు మంచి నీరు గా మార్చుట, నీటి చక్రం, రాకెట్ లాంటి 70కి పైగా నమూనాలు, వర్కింగ్ మోడల్స్ అద్భుతం గా ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సిస్టర్స్ చూచి ఆనందించి, లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని ను అభినందిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు వీర, మేరీ, రాజేశ్వరి, మొ పాల్గొన్నారు. (Story : జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముగిసిన సైన్స్ ఎగ్జిబిషన్ వేడుకలు..)