‘మున్సిపల్ కార్మికులపై’ మున్సిపల్ డిఈ వేధింపులు మానుకోవాలి
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ మున్సిపాల్టీలో ఇంజనీరింగ్ కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలు పరిస్కరించాలని మున్సిపల్ ఆపీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రేవిళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. గత మూడు నెలల క్రితం మున్సిపాల్టీకి డి.ఈ గా వచ్చిన విష్ణు మూర్తి విధులకు వచ్చిన రెండు నెలల నుండి ఇంజనీరింగ్ కార్మికులను మానసికంగా వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే ఇతను నన్ను అడిగే అంతటి వాడా అని వ్యక్తిగత కక్షతో జీతాలు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నాడు. మేము ఏ తప్పు చేయలేదు కదా మా డ్యూటి మేము సక్రమంగా నే చేసుకుంటున్నాం అని అడిగిన ప్రతి కార్మికుడిని మిమ్మల్ని విధుల నుండి తొలిగిస్తాను అని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తున్నాడు. డి.ఈ వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని ఏఐటీయూసీ నాయకులు బూదాల హెచ్చరించారు. ధర్నా జరుగుతున్న సంగతి తెలుసుకొని ధర్నా దగ్గరకు వచ్చిన కమీషనర్ సుభాష్ చంద్రబోస్ కార్మికులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరిస్తాను అని, అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా చెల్లిస్తాం అని కమీషనర్, చైర్ పర్సన్ సతీమణి షకీలా కూడా హామీ ఇవ్వడం తో నిరసన కార్యక్రమం విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగూర్ వలి, స్వామి,మురుగుల నాగరాజు, చిన్న గాలెయ్య,లక్ష్మణ్, జ్యోతి, మల్లీశ్వరి, సంపెంగుల అబ్రహం రాజు, పచ్చిగొర్ల ఏసు, సాయిబాబు, రాచపూడి ఏసు పాదం, తదితరులు పాల్గొన్నారు. (Story : ‘ మున్సిపల్ కార్మికులపై’ మున్సిపల్ డిఈ వేధింపులు మానుకోవాలి)