ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి, అలాగే రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, పేద వారైన,నిరుద్యోగులైన, ప్రతినిత్యం కష్టపడే తత్వం టైలర్ సోదరులదనీ,కష్టపడే వానికి కష్టాలు , అవినీతిపరులకు సుఖాలు అందుతున్న ఈ రోజుల్లో, కష్టపడే ప్రతి పనికి డబ్బున్న వాడు కార్పొరేట్ స్థానంలో పోటీ ఇస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారని, టైలర్స్ కు మంచి బట్ట ఇస్తే సరైన స్టిచ్చింగ్ తో బట్టలు కుడతారని, అదే రెడీమెడ్ షాపులలో బట్టలు తీసుకుంటే సైజులు సరిపోక, కుట్లు పోయి కలర్ పోయి తొందరగా పాడైపోయినా కూడా రంగుల ప్రపంచంలో రెడ్ మెడ్ కు స్థానం ఇస్తున్నారని, ఎలా కాకుండా మన మధ్యలో ఉండే కష్టజీవులకు పనితనం కల్పించాలని ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బి. సి నాయకులు గౌనికాడి యాదయ్య బి.ఆర్.ఎస్ నాయకుడు బొడ్డుపల్లి సతీష్, సూగూరు రాము, రామచంద్రయ్య, మైనార్టీ నాయకులు పాష, వార్డు సభ్యులు శివకుమార్, మారం శ్రీకృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుభాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు)