Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆదివాసీలను ముంచే అక్రమ పోలవరం ప్రాజెక్ట్ కట్టవద్దు

ఆదివాసీలను ముంచే అక్రమ పోలవరం ప్రాజెక్ట్ కట్టవద్దు

ఆదివాసీలను ముంచే

అక్రమ పోలవరం ప్రాజెక్ట్ కట్టవద్దు

ఒడిస్సాలో పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక భారీ నిరసన సభ
మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో లైవ్ లో వామపక్ష నేతలు ముఖాముఖి

న్యూస్ తెలుగు /చింతూరు : ఆదివాసీలను నిండా ముంచే అక్రమ పోలవరం ప్రాజెక్టును నిర్మించవద్దని సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగు చేస్తూ అడవి తల్లిని నమ్ముకొని ఉన్న ఊరుని దూరం చేస్తున్న ప్రాజెక్టు తమకు వద్దంటూ ఒడిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా మోటు తాలూకా కేంద్రంలో క్రీడా మైదానంలో శుక్రవారం ఏర్పాటుచేసిన పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక నిరసన సభ వేలాదిమంది నిరసనకారులతో విజయవంతమైనది. తొలుత శబరి పవిత్ర జలాలను గిరిజన స్త్రీలు కుండలతో మోసుకొని వచ్చి రెండు కిలోమీటర్లు దూరంలో ఏర్పాటుచేసిన సభ వేదిక వద్ద ప్రాజెక్టు వ్యతిరేక నిరసన సభ వద్ద జలాభిషేకం చేసి సభ ప్రారంభించారు. తెలంగాణ జానపద నృత్య కళాకారులు డప్పు వాయిద్యాలతో పోలవరం నిరసన గేయాలను ఆలపించారు. గిరిజన సాంప్రదాయ డోలు కొమ్ము నృత్యాలతో నిరసన సభకు విచ్చేసిన నాయకులకు స్వాగతం పలికారు. నిరసన సభను ఉద్దేశించి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రదీప్ మాంజి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జే కే సి టి ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ మోటు తాలూకాలోని 12 గ్రామ పంచాయతీలలో తాతల కాలం నుండి భూములను నమ్ముకొని అడవి తల్లిని ఆసరాగా చేసుకొని జీవిస్తున్న అడవి బిడ్డలైన ఆదివాసీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మునిగిపోతున్నారని నేటికీ వారికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించకపోవడం బాధాకరమన్నారు. పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో ప్యాకేజీ పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ప్యాకేజీ నిధులను తీసుకువస్తుందని పునరావాస కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతుందని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలో ఆంధ్ర సరిహద్దున ఉన్న మోటు తాలూకా పరిధిలోని ఆదివాసి గ్రామాలు ప్రతి సంవత్సరం వరదలకు ముంపునకు గురై వారి పంటలు ఆస్తులు నష్టపోతున్నారని వారిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఉన్నత న్యాయస్థానాలు కూడా పరిహారం ప్యాకేజీ అందించిన తర్వాతే ప్రాజెక్టు కట్టాలని ఖరాఖండిగా తీర్పు చెప్పినా కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఆదివాసీలను నట్టేట ముంచుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం తెలంగాణ ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఆదివాసి రాష్ట్ర నాయకులు చందా లింగయ్య నేరుగా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో లైవ్ లో మాట్లాడుతూ ఆదివాసీలు నమ్ముకున్న అడవి తల్లి నీ దూరం చేసి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగు చేసే కట్టడం పోలవరం అని గిరిజనులకు న్యాయం చేయాలని దీనిపై అనేక సమరశీల పోరాటాలు కూడా గతంలో చేయడం జరిగినది అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఉనికిని కాపాడే చర్యలు చేపట్టాలని లేకుంటే ఆదివాసీ లంతా ఏకమై తిరుగుబాటుకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలుపుతూ తాము చేసే పోరాటానికి తమ మద్దతు కావాలని నవీన్ పట్నాయక్ ను కోరారు. నాయకుల న్యాయమైన డిమాండ్లకు నవీన్ పట్నాయక్ సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కానీ ప్రతిపక్షంగా శాసనసభలో ఆదివాసీలకు జరిగే అన్యాయంపై ఖచ్చితంగా ప్రశ్నిస్తామని ఆదివాసీలకు పోలవరం ప్రాజెక్టు వలన కలిగే ముప్పును ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి కేంద్రానికి నివేదిక పంపిస్తామని ఆదివాసీలు చేసే న్యాయమైన పోరాటానికి తాము ఎప్పుడు అండగా ఉంటామన్నారు. గతంలో కూడా తమ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ముంపు విషయంలో లిఖితపూర్వకంగా తెలియజేసి అనంతరం స్వయంగా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది అన్నారు. ప్రాజెక్టు ప్రభావంతో ముంపుకు గురయ్యే ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే వరకు తాను అవిశ్రాంతంగా పోరాటం చేస్తానని గిరిజన హక్కులు కాపాడేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం పలువురు మాజీ మంత్రులు మాట్లాడుతూ పోలవరం విషయం కేవలం రాష్ట్రానికి కాదని కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని బహుళార్థక ప్రాజెక్టు కట్టడం దేశానికి మంచిదైన ముంపుకు గురయ్యే నిర్వాసిత కుటుంబాలకు నష్టం వాటిల్లకుండా పరిహారం చెల్లించాలని నష్టాన్ని అంచనా వేసి అధికారులను ముంపు ప్రదేశాలకు తక్షణమే పంపి సర్వేలు నిర్వహించి నివేదికలకు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తరహాలో పరిహారం పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో లైవ్ లో విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనోజ్ మడకామి, మాజీ మంత్రి పద్మిని ధ్యాన్, మాజీ మంత్రి రవి నారాయణ, కోరాపుట్ పీసీసీ అధ్యక్షులు ఈశ్వర పాణిగ్రహి, ఆమ్ ఆద్మీ మల్కనగిరి అధ్యక్షులు రమేష్ చంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు మొన్న ఖాన్, మాజీ ఎంపీ ప్రతి మాజీ, గ్రామ పెద్దలు ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!