రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్
మూడవతు విష్ణు నాయక్
న్యూస్ తెలుగు/ వినుకొండ : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ట్రైబల్ రైట్స్ ఫోరమ్ ( టిఆర్ఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, మూడవ విష్ణు నాయక్, కొడవతు మస్తాన్ నాయక్ తెలిపారు. వినుకొండ లోని టిఆర్ఎఫ్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాతూ. కూటమి ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ. 3,22,359 కోట్లు కేటాయిస్తే, గిరిజన సంక్షేమానికి ఎన్నడూ లేని విధంగా గిరిజన సంక్షేమ శాఖకు 8,159 కోట్లు కేటాయించడం గిరిజన ప్రజలు హర్షించదగ్గ విషయమని, ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని, ఈ బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉందని విష్ణు నాయక్ తెలిపారు. గిరిజన సంక్షేమానికి మంచి బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ప్రభుత్వ చీఫ్ విఫ్ జీ.వి. ఆంజనేయులు కి గిరిజన తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జోన్ ఇంచార్జి దేవసోతూ వెంకటేశ్వర నాయక్, తదితరులు ఉన్నారు. (Story : రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ )