మావోయిస్టులు అమర్చిన బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు
న్యూస్ తెలుగు /చింతూరు : ఛత్తీస్‌గఢ్ జిల్లా సుక్మా జిల్లా లోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంట గోలపల్లి రహదారి లో బండ గ్రామ సమీపంలో భద్రతా బలగాలను మట్టు పెట్టేందు కు నక్సలైట్లు అమర్చిన 5 కిలోల ఐ ఈ డి బాంబు ని పక్కా సమాచారం తో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సి ఆర్ పి యఫ్ 228 బి యన్ , జిల్లా పోలీసులు సంయుక్తంగా నిర్వీర్యం చేశారు. (Story : మావోయిస్టులు అమర్చిన బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు)