ప్రశాంతంగా జరిగిన యం యల్ సి ఎన్నికలు
న్యూస్ తెలుగు /చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ లో యం యల్ సి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది, నాలుగు మండలాల వ్యాప్తంగా 1560ఓటర్లు ఉండగా సుమారు 1230 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లూరి జిల్లా నాలుగు విలీన మండలాల్లోని ఎటపాక మండలంలో 386 మంది ఓటర్లు ఉండగా 273 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, కూనవరం మండలంలో 458 ఓటర్లు ఉండగా 357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు,చింతూరు మండలంలో 388 మంది ఓటర్లు ఉండగా 311 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు,వి.ఆర్ పురం మండలంలో 328 మంది ఓటర్లు ఉండగా 289 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, నాలుగు మండలాల వ్యాప్తంగా 1560 మంది ఓటర్లకు గాను 1230 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. (Story : ప్రశాంతంగా జరిగిన యం యల్ సి ఎన్నికలు)