మహాశివరాత్రి జాగారం..
జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి వద్ద అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువుల దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సాయి బృందావనం చిన్న షిరిడి వద్ద గురూజీ స్వహస్తాలతో 36వ మహాశివరాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. ప్రపంచ శాంతి కోరుతూ 12 ఏళ్ల పాటు జరగనున్న మహా యజ్ఞానికి అభినందనలు తెలుపుతూ తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గురూజీ గత పది సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గం ఆధ్యాత్మికంగా విశేషమైన పూజలు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కళ్యాణంలో పాల్గొని , పూజా కార్యక్రమాలు, పూజ స్వస్తి పుణ్యాహవాచనం, పార్వతి పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు విశేషమైన ద్రవ్యములతో అభిషేకములు విశేష అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4:30 నిమిషాలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఊరేగింపుగా సారే సమర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దంపతులు మహిళ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ అధ్యక్షులు పెండ్యాల వెంకట మోహన్ రావు, కనిగండ్ల అనంత కోటేశ్వరరావు, పెండ్యాల కాశి, కొప్పురావూరి సుధాకర్, పెండ్యాల పుల్లారావు, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : మహాశివరాత్రి జాగారం..)