శివనామ స్మరణతో మారు మోగిన శివాలయాలు
న్యూస్‌తెలుగు/చింతూరు : మహాశివరాత్రి సందర్భంగా చింతూరు, చట్టి, మోతుగూడెం, కుంట లోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. దేవాలయాలను విద్యుత్ కాంతులతో మెరిసేటట్లు బల్బులు అమర్చారు. ప్రతి దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చట్టి లోని గాదెరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వల్ల చత్తీస్గడ్ రాష్ట్రం నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరునాళ్లు నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులు దగ్ధం కాకుండా చూడాలని స్టాల్స్ ద్వారా ప్రజలకు వివరించారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. హాజరైన వేలాదిమంది వేలాది భక్తులకు భద్రాచలానికి చెందిన పసుపులేటి రామకృష్ణ,శ్రీరెడ్ది. సతీష్ కుమార్, ఎడ్లపల్లి రామారావు మహా అన్నదానాన్ని 2016 నుండి నిర్వహిస్తున్నారు. చట్టి,కుంట, చింతూరు, మోతుగూడెం,శివాలయాల్లో లో శివ కళ్యాణం బుధవారం రాత్రికి నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతూరు యస్ ఐ రమేష్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. (Story : శివనామ స్మరణతో మారు మోగిన శివాలయాలు)