హార్వెస్ట్‌ప్లస్ సొల్యూషన్స్’ న్యూట్రీ పాఠశాలలో చెఫ్ సంజీవ్
న్యూస్‌తెలుగు/ముంబయి: హార్వెస్ట్‌ప్లస్ సొల్యూషన్స్ (హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో ఓ చొరవ కార్యక్రమమైన ‘న్యూట్రీ పాఠశాల’ జయప్రదంగా సాగుతోంది. ఇది ఐరన్ పెరల్ మిల్లెట్, జింక్ గోధుమ వంటి జైవిక సమృద్ధమైన ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా పాఠశాల భోజనాన్ని మెరుగుపరుస్తోంది. గడచిన రెండు సంవత్సరాలలో 2.5 మిలియన్లకు పైగా భోజనాల వడ్డన చేయడం ద్వారా, హెచ్‌పీఎస్ బాల్యంలోని పోషకాహార లేమిని దాని మూలంలోనే పరిష్కరిస్తోంది. ప్రముఖ ఛెఫ్ సంజీవ్ కపూర్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలను ప్రాచుర్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతను న్యూట్రీ పాఠశాల విద్యార్థి ఛాంపియన్లను కలిసినప్పుడు, వారు పోషకాహార లేబుల్స్ చదువుకొని, సమాచారంతో కూడిన ఎంపికలు చేయగల సమర్థతను చూసి అతను విస్తుపోయారు. అతని మద్దతుతో, మేక్-ఇన్-ఇండియా చొరవతో న్యూట్రీ పాఠశాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. (Story : హార్వెస్ట్‌ప్లస్ సొల్యూషన్స్’ న్యూట్రీ పాఠశాలలో చెఫ్ సంజీవ్)