ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసిల్దార్ సురేష్ నాయక్ అధ్యక్షతన రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూములు పోరంబోకు భూముల్లో ఇల్లు వేసుకుని దీర్ఘకాలంగా నివాసముంటున్న వారికి చట్టబద్ధత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తాసిల్దారు సురేష్ నాయక్ అన్నారు, వినుకొండ మండలంలో అటువంటి వారిని గుర్తించి అర్హులైన వారందరికీ ఆయా నివాస గృహాలకు చట్టబద్ధత కల్పించి ఆయా కుటుంబాలలో ఆత్మ ధైర్యం కల్పించాలని రెవెన్యూ అధికారులను తాసిల్దార్ సురేష్ నాయక్ కోరారు.(Story : ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం )