పిఠాపురం భూ కబ్జాదారుల నుండి
ప్రభుత్వం భూమిని కాపాడండి
జిల్లా కలెక్టర్కు సిపిఐ విజ్ఞప్తి
కొమరగిరి 71 ఎకరాల ప్రభుత్వ భూమిని భూరాంబందులు నుండి కాపాడి పేదవారికి మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పంచకపోతే మేమే పంచుతాం
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
న్యూస్ తెలుగు /చింతూరు : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి లో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం 71 ఎకరాలు సాగు భూములు కొని 31 ఎకరాలు లేవుట్ చేసిందని అంతలో ఎన్నికలు కోడ్ రావడంతో ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉండటంతో పిఠాపురం తాలూకాఅని చెప్పి కొంత మంది వ్యక్తులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని ఆ భూమి పేదలకు చెందాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం మధు తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి
కే బాడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు తదితర బృందం కొమరగిరి లేఅవుట్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. చుట్టుపక్కల పేదలు స్థలము వద్దకు విచ్చేసి అక్కడ జరుగుతున్న
భూ బాగోతం సిపిఐ బృందానికి వివరించడం జరిగింది. అనంతరం భూ కబ్జాదారులు సాగు చేస్తున్న భూమిని సిపిఐ ప్రభుత్వం బృందం పరిశీలించింది.అనంతరం పేదలను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాడు గత ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాలు కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇళ్ల స్థలాలు కోసము రైతులు వద్ద నుండి భూమిని కొందని ఆయన అన్నారు.రెండు నెలల్లో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇళ్లస్థలాలు ప్రక్రియ ఆగిపోయిందని మధు తెలిపారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం ఎం ఎల్ ఏ తాలూకా అని కొంతమంది భూ కబ్జా దారులు 41 ఎకరాలు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వం భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్ స్పందించి పేదల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని ఆయన కోరారు. లేకుంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో భూ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె గోవింద్ జే అప్పన్న శేషారావు శ్రీని గుత్తుల శ్రీను చిట్టికాసులు శాంతి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. (Story : పిఠాపురం భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం భూమిని కాపాడండి)