వనపర్తి జిల్లా ఆస్పత్రికి మహార్దశ
500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించిన ఆరోగ్యశాఖ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మార్చ్ 2వ తేదీ ఆదివారం వనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రానున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి లో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
అంగీకరించారు అని ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెబ్బేరు పట్టణంలో 30 పడకల ఆసుపత్రికి సైతం మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. (Story : వనపర్తి జిల్లా ఆస్పత్రికి మహార్దశ)