శివస్వాముల ఇరుముడి కార్యక్రమములో మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : శివరాత్రి సందర్భంగా శివస్వాములు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం కోసం ఇరుముడులతో బయలుదేరుతున్న సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి వీడ్కోలు పలికారు. గురుస్వామి ధర్మయ్య యాదవ్,అంజి గురుస్వామి,తోట.శ్రీను,బెంగాలీ.రఘు స్వాములు, సాదరంగా ఆహ్వానించి నిరంజన్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో దీక్ష చేసిన స్వాములు సురక్షితంగా స్వామి దర్శనం చేసుకోవాలని కోరారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్, నందిమల్ల అశోక్, ఉంగ్లమ్. తిరుమల్,నాగన్న యాదవ్,బండారు కృష్ణ, దేవర్ల.నరసింహ,ప్రభాకర్,ఇమ్రాన్,చిట్యాల.రాము,ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : శివస్వాముల ఇరుముడి కార్యక్రమములో మాజీ మంత్రి)