మార్చు 2వ తేదీ ఆదివారం వనపర్తికీ రానున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వచ్చే నెల మార్చ్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి రానున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా వనపర్తిలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రి కి అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో వనపర్తిలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.(Story : మార్చు 2వ తేదీ ఆదివారం వనపర్తికీ రానున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి )