2024లో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సంతృప్తికరమైన సేవలు
న్యూస్‌తెలుగు/బెంగళూరు: ప్రైమ్ సభ్యత్వం కలిగి ఉన్న అమేజాన్ కస్టమర్లు భారీగా ఆదా చేస్తున్నారు. 2024లో, ప్రైమ్ సభ్యులు ఇంతకు ముందు కంటే ఎన్నడూ లేని విధంగా ఆదా చేసారు. అమేజాన్ ఇండియా 2024లో ప్రైమ్ సభ్యుల కోసం అత్యంత వేగంగా డెలివరీలు చేసింది. అదే రోజు లేదా మరుసటి రోజు 41 కోట్లకు పైగా వస్తువులను అందచేసింది. కస్టమర్లు తమకు కావలసినప్పుడు తమకు అవసరమైనది పొందారు. కస్టమర్లు కేవలం టైమ్‌ను మాత్రమే ఆదా చేయడం లేదు, ప్రైమ్ సభ్యులు అత్యంత వేగంగా, ఉచితంగా గత ఏడాది సగటున 3300 కూడా ఆదా చేసారు. వార్షిక ప్రైమ్ సభ్యత్వం ఖర్చు కంటే రెండు రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా, అమేజాన్ ప్రైమ్ 9 బిలియన్ యూనిట్లను అదే రోజు లేదా మరుసటి రోజు అందచేసింది. ప్రపంచవ్యాప్తంగా సభ్యులు సుమారు 95 బిలియన్ డాలర్లను వేగవంతమైన, ఉచిత డెలివరీలో ఆదా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది ఇయర్ ఓవర్ ఇయర్‌లో 26% పెంపుదలను సూచిస్తుంది. (Story ; 2024లో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సంతృప్తికరమైన సేవలు)